కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మునీరాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా కవిత ప్రకటించారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించినట్లు అయ్యింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కవిత.. తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు కవిత తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోషించిందన్నారు కవిత..