| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ

రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ

ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున  రాత్రి సుమారు రెండు గంటల సమయంలో సిరిసిల్ల డిఎస్పీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రాత్రి సమయంలో వచ్చిన గాలి తడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడి ఉండగా,అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని అంచనా వేసి డిఎస్పీ కి తెలియజేయాగ వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి వైర్లను సరిచేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమై వ్యవహరించి డ్రైవర్ తేజ చూపిన చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీస్ అధికారులు అభినందించారు.డ్రైవర్ అంటే కేవలం వాహనం నడిపేవారే కాకుండా,అప్రమత్తతతో ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యతగల వ్యక్తి అని తేజ నిరూపించారు.

Previous 14వ వార్డ్ కౌన్సిలర్ ను సన్మానించిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ హనుమాన్ సత్ సంఘ భక్తులు
Next నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన జర్నలిస్ట్ క్రాంతి
ADVERTISEMENT