Posted on 2026-06-05 21:28:52
ఆ స్థలాలల్లో మహిళలకు వాటా కల్పిస్తాం
డైలీ భారత్, హైదరాబాద్: పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ (LIG), మధ్యతరగతి వర్గాలు (MIG) కు లక్ష ఇండ్లు నిర్మించ బోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్షఇండ్లను నిర్మించి ఆ స్థలములో వారి వాటాకు యజమానిని చేస్తూ పెడింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు ఇతర ప్రాంతాలల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే ప్రరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీనిని దృష్టిలోపెట్టుకొని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో, వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారని అన్నారు.
రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయాయని, ఉపాధి దూరమవడంతో పాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో అనేక కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదన్నారు. ఫలితంగా ఆ గృహాలు ఖాళీగా, నిరుపయోగంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు.
ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోన్నామని మంత్రి వెల్లడించారు.
ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు.
పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్‌లను రూపొందించాలని, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >