Posted on 2026-06-05 20:14:05
డైలీ భారత్, మహబూబాబాద్: హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన 3వ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ (వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ మరియు యోగా) 2026-2027 పోటీలలో మహబూబాబాద్ జిల్లా షీటీమ్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బి. సౌభాగ్య (WPC-1692) విశిష్ట ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీలలో నిర్వహించిన యోగా గ్రూప్ ఈవెంట్‌లో కాంస్య పతకం (Bronze Medal) సాధించి జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ బి. సౌభాగ్య ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో పతకం సాధించిన సౌభాగ్యను ఎస్పీ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >