| Daily భారత్
Logo




మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

News

Posted on 2026-06-06 18:47:24

Share: Share


మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

డైలీ భారత్, కామారెడ్డి : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 99 రోజుల అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు  ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం నేడు కామారెడ్డి పట్టణంలోని లేబర్ అడ్డాలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది కార్మికులు పాల్గొని మహిళల భద్రత, బాలల సంక్షేమం మరియు సామాజిక బాధ్యతలపై అవగాహన పొందారు.

ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ అధికారులు మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాల దుష్పరిణామాలు, బాలల భద్రత, లింగ వివక్ష, లింగ పక్షపాతం, మహిళలపై హింస, సైబర్ నేరాలు, సైబర్ వేధింపులు, షీ టీమ్స్ సేవలు మరియు రోడ్డు భద్రత అంశాలపై సమగ్రంగా వివరించారు.

సమాజంలో ఎక్కడైనా మహిళలు, బాలలు లేదా సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు, వేధింపులు లేదా నేరాలు గుర్తించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1930 (సైబర్ హెల్ప్‌లైన్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మహిళలు, బాలలు మరియు బలహీన వర్గాల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ సిబ్బంది, కళాబృందం సభ్యులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే లేబర్ అడ్డా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాస్, డైలీ లేబర్ కార్మికులు మరియు స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >