Posted on 2026-03-30 20:25:30
బాధితురాలికి న్యాయం, పోలీసుల కృషికి ఎస్పీ ప్రశంసలు
డైలీ భారత్, మహబూబ్‌నగర్ :మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో సోమవారం గౌరవ న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించగా, ఇతర ఇద్దరు నిందితులకు కూడా కఠిన కారాగార శిక్షలు విధించబడినవి. అదేవిధంగా బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయబడింది.
ఈ కేసును మహబూబ్‌నగర్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి తమన్ రాజరాజేశ్వరి విచారించి శిక్షను ఖరారు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్, ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులందరినీ పేరుపేరునా అభినందించారు.
ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన సిఐ వీరస్వామి, ప్రస్తుతం జడ్చర్ల ఎస్‌హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్, అలాగే కోర్టు లైజన్ అధికారులు ఏఎస్‌ఐ బాలకృష్ణ, పీసీ శంకర్, పీసీ రహీమ్, పీసీ కృష్ణయ్య, సీడీవో హెచ్‌సీ రాములు మరియు సమన్లు అందజేసిన పీసీ ఏ. యాదయ్య లని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కేసులో పోలీసుల సమన్వయంతో సమర్థవంతమైన దర్యాప్తు, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణ వల్ల నిందితులకు కఠిన శిక్ష పడిందని ఎస్పీ తెలిపారు.
పిల్లల భద్రతపై పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
#MahabubnagarPolice
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >