Posted on 2026-06-06 20:53:26
4 రోజుల్లోనే కేసులను ఛేదించిన హద్నూర్ పోలీసులకు డీఎస్పీ అభినందనలు
1.5 తులాల బంగారం, రూ.15,000 నగదు, బైక్, మొబైల్ ఫోన్ల స్వాధీనం
డైలీ భారత్, సంగారెడ్డి జిల్లా: తేదీ 01.06.2026న హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగి మరియు బసంత్‌పూర్ గ్రామాల్లో ఇద్దరు మహిళలు తమ వ్యవసాయ చేల్లో పని చేసుకుంటూ ఉండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చి వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఇద్దరు బాధితుల వద్ద నుంచి మొత్తం సుమారు 2 తులాల బంగారాన్ని అపహరించారు.
ఈ ఘటనపై హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 84/2026 మరియు 85/2026 కింద కేసులు నమోదు చేసి, హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా నేడు గంగ్వార్ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఈ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
వెంటనే వారి వద్ద నుంచి 1.5 తులాల బంగారం, రూ.15,000 నగదు, నేరానికి ఉపయోగించిన పల్సర్ మోటార్ సైకిల్ మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించబడింది.
ఈ కేసులను కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించిన హద్నూర్ ఎస్‌ఐ సుజిత్, క్రైమ్ స్టాఫ్ ఆనంద్, ఓం దేవ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది రవి, మహేష్‌లను జహీరాబాద్ డీఎస్పీ శ్రీమతి సైదా నాయక్ అభినందించారు.
ఈ కేసు వివరాలను జహీరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సైదా నాయక్ వెల్లడించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >