| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మహిళామూర్తులకు బిజెపినేత  "గాయత్రి" ఆధ్వర్యంలో ఘనసన్మానం 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునర్కరించుకుని బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆదివారం కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్, గాజులరాజం బస్తి పరిధిలో గల తన ఇంటి వద్ద 60 సంవత్సరాలు దాటిన వృద్ధ మహిళలకు పట్టు శాలువా కప్పి వారికి నూతన వస్త్రాలని అందజేశారు. ఈ సందర్భంగా సదరు మహిళల చే  ఆశీస్సులు తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నారీ శక్తులుగా ప్రతి రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే సామాజిక, ఆర్థిక,  రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని వివరించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ సీనియర్ సిటిజన్ మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Previous శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం
Next రిటైర్డ్ జడ్జీనే డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..
ADVERTISEMENT