| Daily భారత్
Logo




"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

News

Posted on 2026-06-18 21:07:59

Share: Share


"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

అన్నీ సరి చూసాకే టెండర్లను ఖరారు చేసిన ఎంపిక కమిటీ

అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు

డైలీ భారత్, హైదరాబాద్: వర్షాకాలం నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అత్యవసర పనుల నిమిత్తం తీసుకునే మెట్ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ల) ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జీహెచ్ ఎం సీ, సీ ఎం సీ, ఎంఎంసీలకు చెందిన 9 మంది ఇంజినీర్ల కమిటీ ఎంపిక చేసిన వాటిని హైడ్రా అధికారులు పరిశీలించి..  మెట్ టెండర్లను ఖరారు చేసిందని హైడ్రా పేర్కొంది.  మాన్సూన్ టెండర్లలో గోల్మాల్, అవతవకలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. మెట్ వాహనాలను క్షేత్రస్థాయిలో వినియోగించే ముందు పీసీబీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన మేరకు టెండరు ఖరారులో కాస్త సడలింపు ఇచ్చాం. అయితే పాత అనుభవం, ఆర్థిక స్థోమత, సొంతం లేదా లీజు వాహనం విషయంలో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. ఇలా చిన్న సాంకేతిక కారణాలను బూతద్ధంలో చూపించిటెండర్లు దక్కని వారు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.  ప్రభుత్వంపైనా, హైడ్రా పైనా బురద చల్లాలని చేస్తున్న ప్రయత్నంగా హైడ్రా భావించింది. మెట్ టీమ్ల ఎంపిక, వారితో క్షేత్రస్థాయిలో పని చేయించే కార్యక్రమాన్ని హైడ్రా గతేడాది నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులకు, లేని పోని ఆరోపణలు చేసి.. టెండర్లు దక్కించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుండేవారు.  గతేడాది హైడ్రాకు కూడా ఆదిలో ఇలాంటి బెదిరింపులు వస్తే.. వాటిని పఠాపంచలు చేస్తూ సమర్థులకే మెట్ టెండర్లు అప్పగించడం జరిగింది. గతేడాది వర్షాకాలంలో హైడ్రా మెట్ టీమ్లు ఎంత సమర్థవంతంగా పని చేశాయో నగర ప్రజలు గమనించారు. 

సొంతం లేదా లీజు వాహనం ఉండాల్సిందే..

ఈ అసత్య ఆరోపణలకు ప్రధాన సూత్రదారి అయిన పట్నం శ్రీశైలం అనే కాంట్రాక్టరు.. గతేడాది కూడా  వారం రోజుల్లో సొంత వాహనాలు సమకూర్చుతామని హామీ ఇచ్చి వర్షాకాలం పూర్తయిన వరకూ ఏ రోజుకారోజు అద్దెకు తీసుకు వచ్చిన వాహనాలతో నెట్టుకొచ్చారు. ఈ ఏడాది కూడా అదే వ్యక్తి ఏకంగా 30 టెండర్లకు దరఖాస్తులు చేశారు.  గతంలో మాదిరే సొంత వాహనాలు కాని.. లీజుకు తీసుకున్నట్టు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. దీంతో టెండర్ల  ఎంపిక కమిటీ  ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఇదే అక్కసుతో టెండరు ప్రక్రియపై పలు అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల 9వ తేదీన, 12వ తేదీన కురిసిన కుండపోత వర్షాలకు నగర జీవనం స్తంభించిన దృష్ట్యా మెట్ టీమ్లను వెంటనే రంగంలోకి దించాలనే ఉద్దేశంతో మూడు కమిషనరేట్లకు చెందిన ఇంజినీర్లతో పాటు.. హైడ్రా అధికారులతో కూడిన టెండరు ఎంపిక కమిటీ సెలవు దినాల్లో కూడా 24 X 7 గా పని చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. డీసిల్టింగ్, ఇన్స్టాంట్ రిపెయిర్ టీమ్స్(ఐఆర్టీ) పనులు చేపట్టేవారికి కూడా మెట్ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని కొంతమంది కాంట్రాక్టర్లు హైడ్రా కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆ మేరకు ఈ నెల 10వ తేదీన సవరణ (కొరిజాండమ్) ప్రకటన కూడా జారీ చేయడమైంది. ఇలా ఎక్కువమందికి అవకాశం కల్పించి సమర్థతకు అవకాశం కల్పంచేలా హైడ్రా చర్యలు తీసుకుంటే.. టెండరు దక్కని వారు దుష్ప్రచారం చేయడం తగదని హైడ్రా పేర్కొంది. లేనిపోని ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరించింది.

#HYDRAA #MonsoonEmergencyTeams #TransparentTenderProcess #EmergencyResponse

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >