Posted on 2026-06-18 20:45:05
ఏబీవీపీ నాయకుల డిమాండ్
DEO కార్యాలయం ఎదుట ధర్నా
డైలీ భారత్, కామారెడ్డి : పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్రలో భాగంగానే స్కూళ్ల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని, ఈ నిర్ణ యాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసు కోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాల ను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఈ ధర్నాకు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్దఎ త్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్య వస్థను గాలికొదిలేసిందని, పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% సీట్లు అందించే వి ద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లి తండ్రుల రక్త మాంసాలను పీక్కుతుంటూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తు న్న కార్పొరేట్ విద్యా మాఫియాపై చర్యలు
తీసుకోవాలన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఫీజుల భారం నుంచి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు... సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభు త్వ వైఫల్యమే కారణమన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ఫీజులను తలదన్నేలా పాఠశాలల ఫీజులన్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల ని. గురుకులాలకు పక్కా భవనాలు నిర్మిం చాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతో పాటుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, నేషనల్ ఎడ్యు కేషన్ పాలసీ 2020 అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని, పేద విద్యార్థుల కోసం కోట్లాడుతున్న విద్యార్థి పరిషత్ పైన. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన కోట్లాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ స్వస్తిక్, అక్షయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >