| Daily భారత్
Logo




రిటైర్డ్ జడ్జీనే డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..

News

Posted on 2026-03-09 11:22:23

Share: Share


రిటైర్డ్ జడ్జీనే డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..

డైలీ భారత్, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్‌లకు బలవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సైబర్ కేటుగాళ్లు ఈ సారి ఏకంగా రిటైర్డ్ జడ్జీని టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా దోచేశారు. సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని చెప్పి రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు. మీపై విచారణ జరుగుతోందని, కేసు ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తూ డిజిటల్ అరెస్ట్ చేసినట్టు నటించారు. అంతేకాకుండా మీ ఆధార్‌కు లింక్ అయిన రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతరకర కాల్స్ చేస్తున్నాయని చెబుతూ మాజీ జడ్జిని భయభ్రాంతులకు గురిచేశారు.

అదే సమయంలో ఇందిరానగర్లో మీపై కేసు నమోదు అయిందని చెప్పి మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. మీపై మానవ అక్రమ రవాణా కేసు కూడా నమోదైందని, దీనిపై సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ విషయాల గురించి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడకూడదని కూడా హెచ్చరించారు. దర్యాప్తు కోసం మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి, మీరు చెల్లించే మొత్తం విచారణ పూర్తయ్యాక తిరిగి ఇస్తామని నమ్మబలికారు. అరెస్టు అయితే ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందనే భయంతో రిటైర్డ్ జడ్జి మొత్తంగా రూ.1.66 కోట్లు సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. అయితే మోసగాళ్లు చెప్పినట్లుగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మోసం జరిగినట్టు గ్రహించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >