Posted on 2025-12-25 20:22:07
రాయనిగూడెం బేతెస్థ చర్చిలో వితంతులకు, వృద్ధులకు, పేద మహిళలకు చీరెలు పంపిణి
డైలీ భారత్, రాయనిగూడెం:స్థానిక గరిడేపల్లి మండల కేంద్రం రాయనిగూడెం గ్రామంలో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం హెప్సిబా క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టినారు.ఈ సందర్బంగా అల్లం ప్రభాకర్ రెడ్డి మాజీ నల్గొండ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ చేతుల మీదుగా 50 మంది వితంతులకు, వృద్ధులకు, పేద మహిళలకు చీరెలు పంపిణి చేసినారు. బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా దంపతులు నూతనంగా రాయనిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ మరియు కాల్వపల్లి సర్పంచ్ సండ్రపంగు బజారమ్మ వెంకన్న,కాల్వపల్లి ఉప సర్పంచ్ పోర్ల వెంకటేశ్వర్లు,వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ లోకరక్షకుడు క్రీస్తూ జన్మదినమే క్రిస్మస్ అని,పాపులను రక్షించుటకు క్రీస్తూ యేసు లోకమునకు వచ్చాడని సర్వ మానవులను దేవుడు ఒక్కడేని క్రైస్తవుల విశ్వాసమన్నారు. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు.ఈ కార్యక్రమం లో ఆర్చ్ బిషప్ యం. పి. హెచ్. హెచ్. మోజెస్, సంఘ పెద్ద పిల్లి నాగేశ్వరావు, ఆశీర్వదం, మత్తయి, సత్యం, వెంకన్న, ఏసురత్నం, శ్రీను, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >