Posted on 2025-12-24 12:51:51
డైలీ భారత్ న్యూస్, సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు (24-12-2025) ఉదయం 9:30 గంటలకు సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోవడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ స్ట్రాంగ్ వ్యాఖ్యలు...
“సిరిసిల్లలో మంచినీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇది సహజ సమస్య కాదు… ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం.”
“పన్నులు కట్టే ప్రజలకు కనీసంగా తాగునీరు ఇవ్వలేని మున్సిపాలిటీకి పాలన చేసే నైతిక హక్కు లేదని మేము స్పష్టంగా చెబుతున్నాం.”
“వెంటనే మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా పునరుద్ధరించాలి, అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా, సమర్థవంతంగా నిర్వహించాలి.”
“ఇది రాజకీయ పోరాటం కాదు…ఇది ప్రజల జీవన హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం.”
“ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి మరింత బలమైన ఉద్యమాలకు దిగుతుంది.” “సిరిసిల్ల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ నిశ్శబ్దంగా కూర్చోదు – పోరాటం కొనసాగుతుంది అని దోమల శ్రీకాంత్ పేర్కొన్నాడు.
మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష హామీతో రెండు రోజుల్లో పూర్తి సమస్యలు తీర్చుతామని పక్క హామీతో ఇట్టి ధర్నాను విరమించడం జరిగినది
మున్సిపల్ పాలకులకు గట్టి హెచ్చరిక ఇస్తూ, సిరిసిల్ల ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది
ఈ కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్,మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, మోర శ్రీహరి, పల్లికొండ నరసయ్య కాంభోజ శ్రీధర్ అంకారపు రాజు ,చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, కొడం రవి, సూరం వినయ్ సిద్ధి దేవరాజు ఇంజపురి మురళి కృష్ణ గాలి శ్రీనివాస్ ఊరగొండ రాజు కొండ ప్రతాప్.రమేష్, సుంకరి బాలకిషన్ బండారి వెంకటేశ్వర్లు జంప రాజు, దేవరాజు, వర్ణాల శేఖర్ బాబు వెలిశాల అభి రామారావు కనుకయ్య మహిళా నాయకురాళ్ళు,వేముల వైశాలి కమటం మంజుల మల్లీశ్వరి లత వనిత తదితరులు పాల్గొన్నారు
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >