| Daily భారత్
Logo




భద్రాచలం తెప్పోత్సవం,ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

News

Posted on 2025-12-23 20:21:04

Share: Share


భద్రాచలం తెప్పోత్సవం,ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కొరకు నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలి

జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు అధికారులతోసమావేశమయ్యారు.ముందుగా పంచాయితీ ఎన్నికలలో మరియు వర్టీకల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.సంవత్సరం చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ,మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి భాదితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు.పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలని సూచించారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు,కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని  అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.ఈ నెల 29,30 తారీఖులలో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం,ముక్కోటి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల సమన్వయంతో పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పార్కింగ్ స్థలాల ఏర్పాటు,రూట్ మ్యాప్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని తెలిపారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ సీఐ రాము,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-13 22:31:22

Readmore >
Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >