| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్

సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:ఈ రోజు జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బి అండ్ జి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి బి అండ్ జి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గుజ్జె శివరామ్ అధ్యక్షత వహించారు, మానవ హక్కులు, అవినీతి నిరోధక చర్యలు, సమాజంలో ప్రతి పౌరుడికి కల్పించబడవలసిన మౌలిక హక్కుల గురించి వక్తలు వివరించారు.

ఈ సందర్భంగా గుజ్జె శివరామ్ మాట్లాడుతూ 

మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, హక్కుల ఉల్లంఘనపై ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతిని ఎదుర్కొనేందుకు సంఘం నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు కరంపూరి సాయన్న, రాచకొండ మహేష్, చెట్టిపల్లి కృష్ణ, సజ్జనం శ్యామ్ సుందర్, ఆనంతుల రాజు,గుగ్గిళ్ల అనిల్ కుమార్ రాపెల్లి రాజు, కోడం బాలకిషన్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కార్యక్రమం శాంతియుతంగా, ఉత్సాహభరితంగా సాగి, మానవ హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించింది.

Previous ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు
ADVERTISEMENT