| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు

గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు

డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేట ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్   ఆధ్వర్యంలో  2025 - 2026 మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు   మహేశ్వరం  గ్రామాన్ని "కుటుంబ దత్తత కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ దాస్ ప్రిన్సిపాల్  మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం గా వివరించడం జరిగింది ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి వారి యొక్క పరిసరాలు ఇతర వివరాలను సేకరించి రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో వారి యొక్క ఆరోగ్య స్థాయిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని వివరించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి  ఐదు కుటుంబాలను దత్తత తీసుకొని వారి వ్యక్తిగత వివరాలు వారి ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క పరిసరాలు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకునేలా చేయడమే ఈ "కుటుంబ దత్తత కార్యక్రమం" యొక్క ముఖ్య ఉద్దేశం అని వివరించడం జరిగింది.

ఈ  సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ సుజాత అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఈ నాలుగున్నర సంవత్సరాలు వారితో ఒక కుటుంబ సభ్యులుగా మారి వారి యొక్క జీవన విధానాలు ఆరోగ్య ని మెరుగుపరుచుకునేలా సహకరించాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్. సుచరిత, మహేందర్ రెడ్డి, విజయకుమార్, పద్మజ, అశోక్,పంచాయతీ సెక్రెటరీ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Previous సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్
Next డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ మేకప్ ఆర్టిస్ట్ సాయిబాను
ADVERTISEMENT