డైలీ భారత్, కృష్ణాజిల్లా :ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద అదుపు తప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది.
చల్లపల్లి నుంచి విజయ వాడ వెళ్తుండగా మేకావారి పాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే..ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికు లందరూ సురక్షితంగా బయట పడ్డారు.
ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయా ణికులు ఉన్నారని స్థాని కులు గుర్తించారు.
ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీస్ వారికి సమాచారం అందిం చారు. హుటా హుటిన పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారి ని చల్లపల్లి ప్రభుత్వా సుప త్రికి తరలిస్తున్నారు.
బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయట పడ్డారు...