| Daily భారత్
Logo




వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

News

Posted on 2026-08-07 16:00:29

Share: Share


వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

డైలీ భారత్, సూర్యాపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి వెంట వాహనదారులకు అవగాహన కల్పించేందుకు, ప్రమాదాల తీవ్రతను వివరిస్తూ పలు ప్రాంతాల్లో హెచ్చరిక మరియు సూచిక బోర్డులను ఈరోజు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారులలో చైతన్యం తెచ్చేందుకే జాతీయ రహదారిపై ఈ సైన్ బోర్డులను అమర్చినట్లు తెలిపారు. 

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం మరియు తీవ్ర ప్రమాదకరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. 

ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేయాలని కోరారు. 

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >