Posted on 2026-08-07 12:07:52
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వసతులు కల్పించాలి
హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ జిల్లా కమలపూర్ మండలం గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్
డైలీ భారత్, హనుమకొండ జిల్లా: కమలాపూర్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇళ్ల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇళ్ల ప్రారంభోత్సవం, అర్హులైన లబ్ధిదారులకు కేటాయింపు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఇన్ఛార్జి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్న దృష్ట్యా సదుపాయాలను వేగవంతంగా కల్పించాలని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, ఎంపీడీవోలను ఆదేశించారు. గూడూరులో 50, మర్రిపల్లి గూడెంలో 50, కమలాపూర్ లో 302 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇళ్ల సముదాయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.
ఈ సందర్భంగా గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల సర్పంచులు బండి వనజ, పబ్బు సతీష్, కదురు కవిత, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీ, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ దేవిక,తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >