| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పల్లెకో ప్రతినిధి కార్యక్రమానికి శ్రీకారం

పల్లెకో ప్రతినిధి కార్యక్రమానికి శ్రీకారం

తొలి కమిటీ ఏర్పాటు చేసిన కోడిప్యాక సాయిరాంకు ప్రశంసా పత్రం

డైలీ భారత్, కామారెడ్డి :సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన "పల్లెకో ప్రతినిధి" కార్యక్రమంలో భాగంగా తొలి కమిటీని ఏర్పాటు చేసిన సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కోడిప్యాక సాయిరాంను సంస్థ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ అభినందించారు. సంస్థ లక్ష్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ సంస్థ తరఫున ప్రశంసా పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుకు ఈ తొలి అడుగు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన హక్కులు, సేవలపై అవగాహన కల్పించేందుకు "పల్లెకో ప్రతినిధి" కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

కోడిప్యాక సాయిరాం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటును విస్తరించి, సంస్థ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డా. చంటి ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Previous కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ప్లాట్ కబ్జా... ఎస్పీకి మహిళ ఫిర్యాదు
Next సిరిసిల్ల జిల్లాలో ఘోరం... కూలీల గొడవతో యూపీ యువకుడి హత్య
ADVERTISEMENT