| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ DGP సి.వి. ఆనంద్‌తో US కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ భేటీ... క్రికెట్ బంతిని బహూకరించిన కాన్సుల్ జనరల్

తెలంగాణ DGP సి.వి. ఆనంద్‌తో US కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ భేటీ... క్రికెట్ బంతిని బహూకరించిన కాన్సుల్ జనరల్

DGP తో US కాన్సుల్ జనరల్ భేటీ - క్రికెట్ బాల్ గిఫ్ట్

హైదరాబాద్, డైలీ భారత్: తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ ని అమెరికా కాన్సుల్ జనరల్ - హైదరాబాద్ Ms. లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధార్థ్ రామచంద్రన్, సీనియర్ ఫారిన్ సర్వీస్ నేషనల్ ఇన్వెస్టిగేటర్ (FSNI) వెంకట్ పాల్గొన్నారు.

డీజీపీ సి.వి. ఆనంద్ కి క్రీడలపై, ముఖ్యంగా క్రికెట్ పై ఉన్న ఆసక్తిని తెలుసుకున్న Ms. లారా విలియమ్స్, US కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన క్రికెట్ బంతిని ఆయనకు బహూకరించారు. ఈ బహుమతిని తాను ఎప్పటికీ అపురూపంగా దాచుకుంటానని డీజీపీ తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో నివసిస్తున్న అమెరికా పౌరులు, సంస్థల భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో సమన్వయంతో ప్రోయాక్టివ్ గా పనిచేస్తారని డీజీపీ వివరించారు.

Previous బీసీ కులగణన ఆవశ్యకతపై వరంగల్ జిల్లా 2వ మహాసభలు - కుమారస్వామి
ADVERTISEMENT