| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దసరా, బతుకమ్మ వేడుకలపై గ్రామ సర్పంచులతో పోలీసుల సమీక్ష

దసరా, బతుకమ్మ వేడుకలపై  గ్రామ సర్పంచులతో పోలీసుల సమీక్ష

నర్సంపేట/నల్లబెల్లి -  డైలీ భారత్: వరంగల్  సి పి ఆదేశానుసారం  నల్లబెల్లి మండల పరిధిలో దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో   నల్లబెల్లి ఎస్ఐ. ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో  గ్రామీణ సి ఐ మండలంలోని గ్రామ సర్పంచ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేశారు.

పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, యువత సహకరించాలని, పోలీసులకు సమాచారం అందించాలని సి ఐ ఎస్ఐలు  కోరారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంటుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Previous నర్సంపేట మెడికల్ కాలేజీలో ముందస్తు సద్దుల బతుకమ్మ వేడుకలు
Next బీసీ కులగణన ఆవశ్యకతపై వరంగల్ జిల్లా 2వ మహాసభలు - కుమారస్వామి
ADVERTISEMENT