| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రీ-సర్వేపై అపోహలు వీడి ప్రజలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

రీ-సర్వేపై అపోహలు వీడి ప్రజలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

డైలీ భారత్, వరంగల్ :పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూముల రీ-సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. రీ-సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల వివరాల్లో స్పష్టత, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. రీ-సర్వేపై ఎలాంటి అపోహలకు గురికాకుండా రైతులు, భూ యజమానులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు.

భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, రికార్డుల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసరావు, వరంగల్ ఆర్డీవో సుమ, పర్వతగిరి తహసిల్దార్ వెంకటస్వామి, గోపనపల్లి సర్పంచ్ నాంపల్లి విజయ, అనంతరం సర్పంచ్ తోట శ్రీలత, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Previous సిరిసిల్ల జిల్లాలో ఘోరం... కూలీల గొడవతో యూపీ యువకుడి హత్య
Next నర్సంపేట మెడికల్ కాలేజీలో ముందస్తు సద్దుల బతుకమ్మ వేడుకలు
ADVERTISEMENT