సిరిసిల్ల జిల్లా/ఎల్లారెడ్డిపేట - డైలీ భారత్: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఘోరం జరిగింది. కూలీల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్ సింగ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో జరిగిన తీవ్ర ఘర్షణలో పవన్ సింగ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.