| Daily భారత్
Logo




రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

News

Posted on 2026-08-08 07:38:13

Share: Share


రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

కారుతో తొక్కించి "బ్రెయిన్ డెడ్"... 

డైలీ భారత్, రాజమహేంద్రవరం, డిజిటల్ డెస్క్:మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం ఒక ఉన్నత విద్యావంతురాలైన వైద్య విద్యార్థిని జీవితాన్ని నిలువునా బలితీసుకుంది. రాజమండ్రి నగరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగిన ఈ అమానుష ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. కారుతో ఢీకొట్టడమే కాకుండా, సదరు విద్యార్థినిపై నుంచే కారు పోనిచ్చిన నిందితుల రాక్షసత్వం విస్తుగొలుపుతోంది. 

సెక్యూరిటీ ఆపారని కక్ష.. ప్రశ్నించిందని ఘోరం!

గుంటూరుకు చెందిన డాక్టర్ ప్రియాంక (28), రాజమండ్రి జీఎస్‌ఎల్ (GSL) మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తోంది. ఆగస్ట్ 3వ తేదీ రాత్రి, ఆమె తన సహచర విద్యార్థి ఉమేష్‌తో కలిసి సినిమా చూసి స్కూటీపై బయటకు వస్తోంది. 

అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు పీకలదాకా తాగి మాల్ వద్దకు వచ్చారు. లోపలికి రానివ్వని సెక్యూరిటీ సిబ్బందిపై కక్షతో, వారు కారును రోడ్డుపైకి అతివేగంగా రివర్స్ తీస్తూ ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. దీనిపై ప్రియాంక నిలదీయడంతో సదరు తాగుబోతులు ఊగిపోయారు. కారును వెనక్కి తీసి, మళ్లీ అంతే స్పీడ్‌తో ప్రియాంకపైకి దూసకొచ్చారు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోగా, కనికరం లేకుండా ఆమె తలపై నుంచే కారును పోనిచ్చి పారిపోయారు. 

హాస్పిటల్‌లో "బ్రెయిన్ డెడ్".. కన్నీటితో అవయవదానం

తలకు తీవ్ర గాయాలైన ప్రియాంకను సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ, కోలుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యులు ఆమెను "బ్రెయిన్ డెడ్" గా ప్రకటించారు. ఎంతో గుండెకోతగా ఉన్నప్పటికీ, తమ కుమార్తె వేరొకరి రూపంలో బ్రతుకుతుందనే ఆశతో తల్లిదండ్రులు అవయవదానానికి (Organ Donation) అంగీకరించారు. 

సీఎం చంద్రబాబు ఫైర్.. నిందితులు జైలుకు!

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ హత్యా ప్రయత్నమేనని, నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని పోలీసులను ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు దుష్యంత్, ఆండ్రూలను అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు.

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >