ఆదివారం విషాదం
డైలీ భారత్, కృష్ణాజిల్లా :కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఆదివారం విషాదఛాయలు అలుము కున్నాయి. సముద్రంలో ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కొట్టుకపోగా మెరైన్ పోలీసులు నలుగు రిని కాపాడగా ఒకరు మృతి చెందారు.
ఆదివారం సెలవు దినం కావడం తో నూజి వీడు త్రిబుల్ ఐటీ లో చదు వుతున్న 5 గురు స్టూడెంట్ ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్నానం చేయడానికి దిగారు.
నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులంతా కలిసి తాళ్ళపాలెం బీచ్ లో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.
కొద్దిసేపటికి ఇంతలోనే వారి ఆనందంపై ఓ రాకాసి అల నీరుచల్లింది. సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న నలుగురిని మెరైన్ పోలీ సులు రక్షించారు.
అదే సమయంలో పెద్ద అలల కింద తోకల అఖిల్ కొట్టుకుపోవడం తో విషాదాన్ని మిగిల్చింది. మెరైన్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసిన అతని జాడ కనపడలేదు. గల్లంతయిన అఖిల్ కోసం మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపు సందర్భంగా అఖిల్ మృతదేహం లభ్య మైంది. మిత్రులందరికీ అఖిల్ మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు....