Posted on 2025-06-28 07:03:48
డైలీ భారత్, హనుమకొండ: జిల్లాలోని కాజీపేటలో దారుణ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఫైనాన్షియల్ వివాదమే ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. రైల్వే క్వాటర్‌లో నివసిస్తున్న నవీన్ కుమార్ ( 38)ను అదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ. 40,000 నగదు అడిగిన విషయం పై మాటామాటా పెరిగింది. ఉద్రిక్తత ముదిరి కత్తితో దాడికి దిగిన ప్రవీణ్, నవీన్ పై నేరుగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫైనాన్షియల్ నడుపుతున్న నవీన్ కుమార్ కొద్ది రోజుల కిందట ప్రవీణ్ కు 40,000 ఇచ్చాడని ఆ డబ్బులు అడిగినందుకే ప్రవీణ్ ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పై నవీన్ కుమార్ భార్య మాధవి కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >