Posted on 2025-06-28 08:48:58
డైలీ భారత్, హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఈరోజు ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను గేటు బయటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు యత్నించారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకు దిగారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >