Posted on 2025-06-27 07:46:46
డైలీ భారత్, గుజరాత్: జగన్నాథ రథయాత్ర లో ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.
ఒడిశా లోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్‌లోని గోల్‌వాడ లో రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఘటన కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >