| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

డైలీ భారత్, హైదరాబాద్:శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్  వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 20వ తేదీన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ చీటింగ్  కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ నాయక్ 2లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదు దారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు. అప్పటికే 21వ తేదీన 2 లక్షల రూపాయలు లంచం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురామ్ కారులో ఇవగ, మరో సారి ఫోన్ చేసి అదనంగా మరో 25 వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుడు 22 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు. సోమవారం మరో 22 వేల రూపాయలు పోలీస్ స్టేషన్ లోని చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదు దారుడుకి సూచించారని చెప్పారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడు చెత్త బుట్టలో వేసి వెళ్లిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురామ్ ను పట్టుకున్నామన్నాడు. దీంతో ఎస్ఐ పరశురామ్ పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచామన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్స్ అప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Previous విశాఖ, కుప్పం, గుంటూరు, మేయర్ పదవులు దక్కించుకున్నా టిడిపి
Next గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ త్రీ నిర్మాణాలు
ADVERTISEMENT