| Daily భారత్
Logo




గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ త్రీ నిర్మాణాలు

News

Posted on 2025-04-29 18:25:42

Share: Share


గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ త్రీ నిర్మాణాలు

హద్దులు దాటి జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం

లక్ష్మీదేవి పల్లి పంచాయతీలో అనేక అక్రమ నిర్మాణాలు 

పట్టించుకోని సెక్రటరీ మండల అధికారులు  

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలో చాతకొండ వెళ్లే రహదారి పక్కన కృష్ణవేణి కాలేజీ ఎదురుగా  హద్దులు దాటి అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నాల్లోనే వెలస్తున్నాయి.. ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు మండల అధికారులు. 1/70 గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జీ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపడుతున్న ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు లక్ష్మీదేవి పల్లి పంచాయతీకి వర్తించవు అన్న రీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న పంచాయతీ సిబ్బంది నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి ?. నిర్మాణము మొదలు పెడితేనే నోటీసులు ఇచ్చాము అని చెప్పే పంచాయతీ సిబ్బంది ఈ జి ప్లస్ త్రీ నిర్మాణానికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా అక్రమ నిర్మాణాలకు అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుంది. ఇదంతా ఒక ప్లాను ప్రకారమే జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పునాది వేసినప్పుడే అడ్డుపడాల్సిన పంచాయతీ సిబ్బంది జి ప్లస్ త్రీ నిర్మాణం చేసినా కూడా కల్లుండి చూడలేని రీతిగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి సందేహం లేదు. కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి  జి ప్లస్ త్రీ నిర్మాణం చేస్తున్న చూడకపోవడం మరి విడ్డూరంగా ఉంది. మండల అధికారులు పంచాయతీలలో పర్యవేక్షిస్తున్నారా లేరా అనే సందేహము లేకపోలేదు. అంటే ఈ జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం ఎవరికి కనిపించలేదంటారా లేక ముడుపులు ఏమైనా అందాయ అని అనుకుంటున్న ప్రజలు.  ఇటువంటివి దాదాపు ఈ పంచాయతీలోనే పదుల సంఖ్యలో నిర్మాణాలు  ఉన్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది వీటిని అరికట్టేది ఎవరు? నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకుంటున్నారు .వాటిని ఆపే ప్రయత్నం ఏ అధికారి చేయలేకపోవడం వంటివి చూస్తుంటే  పంచాయతీలో ఏ విధంగా డబ్బు చేతులు మారుతుందో అర్థమవుతుంది. ఇకనైనా జిల్లా అధికారులు కల్పించుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని కోరుతున్నా ప్రజలు . అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు తెలియవలసి ఉన్నది.జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఇట్టి అక్రమ నిర్మాణాలు నిలుపుదాల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు. ఇట్టి నిర్మాణాలకు సహకరిస్తున్న పంచాయతీ మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు..

Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >