Posted on 2024-10-29 11:44:41
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘము ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా పై భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి.రాములు మాట్లాడుతూ గత 3 నెలలుగా ఇసుక,మొరం కు అనుమతులు లేకపోవడంతో లేబర్ అడ్డాపై కూలీలకు పనిలేక,బతకడానికి పూట గడవక తిండికి కూడా తీవ్ర ఇబ్బంది అవుతోందని అన్నారు.బీహార్,UP లాంటి వలస కూలీ లతో స్థానిక కార్మికులకు ఉపాది లేకుండా పోయిందని,వారు తక్కువ కూలీకి పని చేయడంతో స్థానికులకు తీవ్ర నష్టం అవుతోందని ఇట్టి విషయంలో ఇతర రాష్ట్రాల లేబర్ కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకొనైనా స్థానిక కార్మికుల ఉపాధిని కాపాడాలని అన్నారు.కొద్దీ రోజుల క్రితం ఇసుకకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్కు 4 ట్రిప్పులు మాత్రమే వారానికి ఇవ్వడంతో అందరికి పని దొరకక ఇబ్బంది పడుతున్నారని ప్రతిరోజు ఇసుక పర్మిషన్ లు ఇవ్వాలని కోరారు.అలాగే నూతన లేబర్ కార్డులు అందించడం కోసం ఆన్లైన్ సైట్ ను ఓపెన్ చెయ్యాలని నిన్నటి రోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ కమిషనర్ గంగాధర్ కి వినతి పత్రం ఇవ్వడంతో తక్షణమే ఆయన స్పందించి ఓపెన్ చేస్తామని,పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తామని,రిన్యువల్ కార్డులు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు,కావున కార్మికులు గమనించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ.వేణు,కలికోట.దేవదాసు, తంగానపెళ్లి.పొసయ్య తదితర భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >