| Daily భారత్
Logo




బోనస్ మరియు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి

News

Posted on 2023-11-10 14:39:03

Share: Share


బోనస్ మరియు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి

షాపులు షాపింగ్ మాల్ లలో పనిచేసే గుమస్తాలకు బోనస్ మరియు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. 

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్ మోర అజయ్ డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఎగమంటి ఎల్లారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూశం రమేష్ మోర అజయ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ఇంటర్ డిగ్రీలు ఆ పైన చదివిన అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక షాపులు షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తుంటే అట్టి యజమానులు వారి నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని అదేవిధంగా ఒక్క మనిషి ఈ రోజులలో ఆటో కైనా బస్సులలోనైనా ప్రయాణం చేసి సిటీకి చేరుకోవాలంటే కనీసం రానుపోను 50 నుండి 100 రూపాయల ఖర్చులు అవుతున్నాయి కానీ యజమానులు మాత్రం 6000 నుండి 9000 వరకు మాత్రమే ఇస్తూ రాత్రి పది గంటల వరకు వారితో శ్రమ చేయించుకుంటూ ఉన్నారు. నెలలో ప్రయాణ ఖర్చులు తీసివేస్తే 3000 నుండి 6000 వరకు మాత్రమే వేతనాలు వారికి అందుతున్నాయి కనీసం పనిచేసే గుమస్తాలకు టి ఏ డి ఏ లు కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం కార్మిక శాఖ అధికారులు కూడా అటువైపుగా చూస్తున్నటువంటి దాఖలాలు లేవు షాపింగ్ మాల్స్ లలో దాదాపు 20 నుండి 30 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కనీసం వారికి పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించకుండా కార్మిక శాఖ అధికారులను పీఎఫ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ గుమస్తాలకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుని వారిని పని నుండి తొలగిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కావున ఇప్పుడు వచ్చిన దీపావళికి వెంటనే ఒక నెల వేతనం బోనస్ గా ఇచ్చి తదుపరి నుండి కనీస వేతనాలు  వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుమస్తా సోదరి సోదరులు ఒకవేళ ఇవ్వని ఎడల కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు చేయగలరు లేదా జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >