| Daily భారత్
Logo




స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ లు, కేంద్ర బలగాలు, జిల్లా పోలీసు బలగాలతో నిరంతరం గస్తీ: వినిత సాహు ఐపీఎస్.

News

Posted on 2023-11-10 14:44:13

Share: Share


స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ లు, కేంద్ర బలగాలు, జిల్లా పోలీసు బలగాలతో నిరంతరం గస్తీ: వినిత సాహు ఐపీఎస్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాసన సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లును జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి భద్రత ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సమీక్షించారు ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.... 

సిరిసిల్ల , వేములవాడ లలో  స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రంల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నీడలో, కేంద్ర, జిల్లా బలగాలతో పకడ్బంది నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగ  ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తో కలసి సందర్శించారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  సిరిసిల్ల, వేములవాడ లోని నామినేషన్ కేంద్రాల  వద్ద ఏర్పాటు చేసిన బందోబస్త్,భద్రత ఏర్పాట్లు ను జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు వినిత సాహు ఐపీఎస్ ఎం,గారికి వివరించారు.అనంతరం నామినేషన్ కేంద్రాల వద్ద  ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు.పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 8121258834 కు ఫోన్ చేయవచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్  తెలిపారు.

వీరి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, ఆర్.ఎస్.ఐ జునైద్ ఉన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >