Posted on 2024-09-11 13:13:26
డైలీ భారత్, బోధన్: నిజామాబాద్ - బోధన్లో బస్టాండ్ సమీపంలో 2 రోజుల క్రితం ఓ తల్లి తన 10 నెలల బిడ్డను వదిలి మూత్రశాలకు వెళ్లింది.
తిరిగివచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు సమీప ప్రాంతంలో ఓ చిన్నారి శరీరభాగాలు దొరికాయి.
కుక్కలు పీక్కుతిన్నట్టుగా గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. రోడ్ల మీద వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మధ్య వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తమై వీధి కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా వుంది.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కలు దాడి చేయడంతో 10 నెలల బాలుడు బలయ్యాడు. బాలుడి మృతదేహం లభ్యమైన తీరు.. చిన్నారిని కుక్కలు ఏ విధంగా పీక్కుతిన్నాయో అర్ధమవుతోంది. ఈ ఘోర ఘటన బోధన్ లో చోటు చేసుకుంది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే లక్ష్మి అనే మహిళ మంగళవారం (సెప్టెంబర్ 10) బోధన్ బస్టాండ్ కు సమీపంలో.. పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో రోడ్డుపై తన 10 నెలల బాబుని పడుకోబెట్టి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి బాబు అక్కడ లేడు. చుట్టు పక్కల వెతికింది. ఎక్కడో దూరాన కుక్కలు కనిపించాయి. అవే తన బిడ్డను ఎత్తుకెళ్లి ఉంటాయని ఊహించింది.
దాంతో లక్ష్మి బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. బాబు కోసం గాలించారు. పరిసర ప్రాంతాల్లో అన్వేషించగా.. బాలుడి శరీర భాగాలు కనిపించడంతో.. కుక్కలు పీక్కుతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో బాబును కుక్కలు ఎత్తుకెళ్లి దాడిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన పేగులు, అవయవాలు చిన్నారివో కాదో తెలుసుకునేందుకు పోలీసులు వాటిని వైద్య పరీక్షలకు పంపారు. రిపోర్ట్ వచ్చాక..
ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >