Posted on 2024-09-11 12:04:28
మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, కట్ట వెంకటేష్ ల అభినందనలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా నియమితులైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, కట్ట వెంకటేష్, అంజద్ గొరి, రఘుమా రెడ్డి, వీర్లపల్లి అన్వర్, కృష్ణారెడ్డి, అలిమ్,జగదీశ్వర్ ముదిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున గజమాల, శాలువా వేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు బిడ్డ, విద్యావంతుడు, సౌమ్యుడు, ఎల్లవేళలా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రభుత్వం గౌరవప్రదమైన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా నియమించడం అభినందనీయమన్నారు. జనం మెచ్చిన, నచ్చిన నేతను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిలిస్తే పలికే నేత శంకరన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు..
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >