Posted on 2023-11-09 16:47:42
డైలీ భారత్, సిరిసిల్ల :బిఆర్ఎస్ కు కంచుకోటలా ఉన్న సిరిసిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యంగా కావాలా....కరెంటు కాలాల కాంగ్రెస్ కావాలా...నీళ్ళు కావాలా కన్నీళ్లు కావాలా...కెసిఆర్ స్కీములు కావాలా...కాంగ్రెస్ స్క్యాములు కావాలా ఆలోచించండని కేటీఆర్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు. 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారా... సిరిసిల్లాను సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఆలోచించండన్నారు. తెలంగాణలో ప్రశ్నించే ఒకే ఒక గొంతుక కెసిఆర్ ను అనుచివేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడని విమర్శించారు. పది ఏండ్ల పాలనలో కెసిఆర్ ఎన్నడూ కుల రాజకీయాలు, మత విద్వాంసాలకు తెర తీయలేదని, ఇప్పుడు కుల, మత పిచ్చి గాల్లను ఓటు వేసి గెలిపించి వాటికి తావిద్దామా ఆలోచించాలని కోరారు. రాజకీయంగా జన్మనిచ్చి రాష్ట్రంలో,దేశంలో, విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల అని సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానన్నారు. 15 ఏండ్లగా అవినీతి రహితంగా పని చేసి, సిరిసిల్ల ముఖ చిత్రం మార్చామన్నారు. ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నానని, గడప గడపకు తిరగక పోయిన ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్ననని, గులాబి దండు నాకు అండగా ఉందని గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నానన్నారు. గతంలో తప్పు చేసి 55 ఎండ్లు బాధపడ్డమని, మళ్ళీ తప్పు చేస్తే 50 ఎండ్లు బాధపడవలసి వస్తుందని గుర్తు చేశారు. ప్రలోబాలకు లొంగీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తదని, సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని, సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >