Posted on 2024-09-07 11:49:56
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ బాలుడిని ఓ దొంగ దారుణంగా హత్యచేశాడు. దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తిని చూసిన బాలుడు ఎక్కడ అరిచి ఇంట్లో వాళ్లను పిలుస్తాడేమో అన్న భయంతో బాలుడిని బలంగా నేలకేసి కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కుమారుడు కట్టప్ప (6) ఉన్నాడు. అయితే, బాలుడి తండ్రి దుర్గయ్య స్థానికంగా పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎల్లయ్య అనే వ్యక్తి ఆ పందులను దొంగిలించేందుకు దుర్గయ్య ఇంటి వద్దకు వచ్చాడు. అది బాలుడు కట్టప్ప గమనించాడు. అయితే, బాలుడు తనను ఎక్కడ పట్టిస్తాడో అన్న భయంతో ఎల్లయ్య కట్టప్పను నేలకేసి కొట్టి దారుణంగా హత్యచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >