| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

ప్రముఖ విద్యాసంస్థ తిరుమల డైరెక్టర్ దుర్మరణం!

డైలీ భారత్, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ డైరెక్టర్ నున్న సురేష్ (52) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, నున్న సురేష్ తన కుటుంబ సభ్యులు నున్న విమలదేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరారు. బొమ్మలూరు టోల్‌గేట్ సమీపానికి చేరుకోగానే ముందుగా నిలిపి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో నున్న విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Previous గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Next కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
ADVERTISEMENT