| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు సంచలన ఆదేశాలు

డైలీ భారత్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. ఆ పదవిలో కొనసాగకూడదని తేల్చి చెప్పింది. హైకోర్టుకు రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినా.. ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ ఆక్రమణలను అడ్డుకోవడం.. చెరువులు, కుంటలు, పార్కులను రక్షించడం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో అర్హత కలిగిన మరో అధికారిని ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.లోతుకుంట భూముల వ్యవహారంపై జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేసి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. కోర్టులు, దేశ న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. లోతుకుంటలోని వివాదాస్పద 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని.. అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కూడా అఫిడవిట్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరోపించారు.

అయితే ఈ వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సెక్రటరీ హోదాలో ఉన్న ఒక ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను ఇన్నిసార్లు ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని.. ఆయన స్థానంలో అర్హత కలిగిన మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర పరిపాలనలో కీలక పరిణామంగా మారగా, ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Previous RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Next డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
ADVERTISEMENT