Posted on 2026-07-25 16:42:32
సిరిసిల్లలో "Gift A Smile" కార్యక్రమం.
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బి.వై.నగర్ 34వ వార్డుకు చెందిన కుడిక్యాల సతీష్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల కారణంగా వారి కుమార్తె ఉన్నత చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, "Gift A Smile" కార్యక్రమం ద్వారా కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్తె మాట్లాడుతూ.. తనకు ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, తండ్రి అనారోగ్యం మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సిరిసిల్లలోనే డిగ్రీ చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, ఆమెకు ధైర్యం చెబుతూ విద్యకు సంబంధించిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, పంతం శ్రీనివాస్, కోమాకుల ఆంజనేయులు, గుర్రాల నర్సింలు, గజ్జెల్లి సత్యనారాయణ, ఆడెపు రవి, శ్రీపతి సురేష్, సింగం శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >