| Daily భారత్
Logo




ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

News

Posted on 2026-07-25 15:43:36

Share: Share


ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

డైలీ భారత్, కామారెడ్డి :  ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "తెలంగాణ జలసిరి" కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సూచించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లు, డీ.ఆర్.డీ.ఓలు, జెడ్పీ సీ.ఈ.ఓలు, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో, ఎం.పీ.డీ.ఓలతో మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ప్ సీ.ఈ.ఓ దివ్యదేవరాజన్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ప్రతీకూల పరిస్థితుల్లో వీబీజీ రామ్-జీ (VBG-RAM-G) పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు విరివిగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని అన్నారు. గ్రామ సభలను నిర్వహిస్తూ ఈ పనుల ఆవశ్యకత గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం వీబీజీ రామ్-జీ పథకం కింద ఇంకుడుగుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విరివిగా జలసిరి కార్యక్రమం అమలయ్యేలా చూడాలన్నారు. ఈ పనుల పరిశీలన కోసం మండల స్థాయిలో గ్రామీణ నీటి సరఫరా ఏ.ఈ, పంచాయతీరాజ్ ఏ.ఈ, ఎం.పీ.డీ.ఓ, ఎం.పీ.ఓ, ఏ.పీ.ఓలతో కమిటీని ఏర్పాటు చేసి, వారి అధ్వర్యంలో పనులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతీచోట పండగ వాతావరణంలో జలసిరి కార్యక్రమాలు అమలు జరగాలని, ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కూలీలకు చేతినిండా పని కల్పిస్తూ, పనిదినాల లక్ష్యాన్ని సాధించడంతో పాటు నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని హితవు పలికారు.  వీబీజీ రామ్-జీ పథకం కింద 318 రకాల పనులను చేపట్టవచ్చని, అయితే ప్రస్తుత తరుణంలో భూగర్భ జలాల పెంపునకు దోహదపడే జలసిరి కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామ సభలలో చర్చించుకుని చేపట్టే ప్రతి పని ప్రజలకు ఉపయోగకరంగా నిలువాలన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ NY గిరి, జెడ్పీ సీ.ఈ.ఓ చందర్, డీ.ఆర్.డీ. దామోదర్ రెడ్డి, డీ.పీ.ఓ మురళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >