Posted on 2026-07-25 15:38:33
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకుని నగరంలోని నాందేవ్ వాడ, బ్రహ్మపురి లో గల విఠలేశ్వర ఆలయాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహావిష్ణువు రూపం విట్టలేశ్వరుడు అన్నారు. ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఉపవాసం చేసి మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలిగి, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం అన్నారు. మహారాష్ట్ర లో అక్కడి ప్రజలు విఠలేశ్వరుడు, రుక్మిణి దేవి ను అత్యధికంగా కొలుస్తారని, ఇందూరులోనూ మహారాష్ట్ర సాంప్రదాయం పాటిస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >