Posted on 2026-07-25 15:37:20
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రతి ప్రభుత్వ పనులపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రద్ధ వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్ ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.60 కోట్లతో ప్రారంభమైన పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రతి డివిజన్ కు కోటి రూపాయలు కేటాయించారని త్వరలోనే అన్ని డివిజన్లో పనులు ప్రారంభమవుయని తెలిపారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే నూతన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ప్రధానగా నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రూ.30 కోట్లతో రోడ్డు ప్రతిపాదించామన్నారు. అలాగే ఆర్ యూబీ ల నిర్మాణానికి రూ.60 కోట్లు, నాందేవ్ వాడ వంతెన పొడిగింపునకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అమృత్ 2 కింద మంజూరైన యూజీడీ పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, డీఈ యోగేందర్, ఏఈ శంకర్, యూ జీ డీ ప్రాజెక్ట్ మేనేజర్ జయశంకర్, ఆర్ అండ్ బి అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >