Posted on 2026-07-25 15:36:10
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: జిల్లా పర్యటనకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్ లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి జీవీఎన్.భరత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, సీ.పీ, అదనపు కలెక్టర్ తదితరులతో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >