| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

ప్రజల భూ హక్కుల కోసం చేసిన పోరాటానికి న్యాయం జరిగిన చారిత్రాత్మక ఘట్టం

డైలీ భారత్, హైదరాబాద్: 2003 సంవత్సరం నుండి ప్రజల భూ హక్కులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త డా. మద్దిశెట్టి సామేలు పై 03-11-2011న అప్పటి సత్తుపల్లి డీఎస్పీ రౌడీషీట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆ రౌడీషీట్ చట్టవిరుద్ధమని భావించిన డా. మద్దిశెట్టి సామేలు 2016లో తెలంగాణ హైకోర్టులో W.P. No.23418/2016 దాఖలు చేసి న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. దాదాపు 15 సంవత్సరాల న్యాయపోరాటం అనంతరం, 23-03-2026న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజి రౌడీషీట్ కొనసాగింపును చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ దానిని రద్దు చేయడాన్ని డా. మద్దిశెట్టి సామేలు మనస్పూర్తిగా స్వాగతించారు.  ఈ సందర్భంగా డా. మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, సామాజిక ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వారు న్యాయం కోసం ప్రభుత్వ శాఖలను ఆశ్రయిస్తారని, అయితే కొన్నిసార్లు సంబంధిత అధికారులు తప్పుడు ఆధారాలు సృష్టించి, అసత్య ఆరోపణలు చేస్తూ న్యాయస్థానాలు, కమిషన్లకు నివేదికలు సమర్పించడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై అనవసరమైన ఇబ్బందులను కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం నాగుపల్లి భూదాన భూముల అంశానికి సంబంధించిన సివిల్ వివాదాల నేపథ్యంలోనే తనపై రౌడీషీట్ తెరవబడిందని పేర్కొన్నారు. రౌడీషీట్ కారణంగా తన కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజల మధ్య అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, తాను నిరపరాధినైనా నిజమైన నేరస్థుడిగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారని తెలిపారు. అయితే చివరకు సత్యం గెలిచిందని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని పేర్కొంటూ, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ న్యాయపోరాటంలో తన తరఫున సమర్థవంతంగా వాదించి, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం కలిగేలా చేసిన అడ్వకేట్  అడ్వకేట్ శ్రీ నామవరపు చంటి బాబు మరియు వి. కిరణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి న్యాయపరమైన కృషి వల్లే సత్యానికి విజయం లభించిందన్నారు.

Previous క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
Next ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం
ADVERTISEMENT