Posted on 2026-07-24 04:20:53
హైడ్రా కమిషనర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్
డైలీ భారత్, హైదరాబాద్:ఆర్మీకి చెందిన భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని.. ఆ భూమిని కాపాడాలని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ జై సింగ్ కలసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని జీఎల్ఆర్ సర్వే నంబరు 507లోని .. ఆర్మీకి చెందిన ఏ-1 భూమి ఉండగా అందులో ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన భూమిని ఆక్రమించి జి ప్లస్ 2 భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఆ నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. వెంటనే నిర్మాణాలను ఆపించి ఆ స్థలాన్ని కాపాడాలని కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ను లెఫ్టినెంట్ కల్నల్ కలిసినప్పుడు హైడ్రా ACP ఉమామహేశ్వర రావు గారు కూడా ఉన్నారు.
#HYDRAA #ArmyLand #DefenceLand #ProtectPublicAssets #StopEncroachments
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >