| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

రూ.11.55 లక్షల విలువైన 23.100 కేజీల గంజాయి స్వాధీనం...

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: కల్లూరు పట్టణ శివారులో అక్రమంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి వద్ద నుండి రూ. 11, 55,000/- విలువైన 23.100 కేజీల ఎండు గంజాయి, ఒక ఆటో రిక్షా, రెండు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు, ఐదు వేల నగదు  స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుందరా యాదవ్ తెలిపారు. 

కల్లూరు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. కల్లూరు శివారు కాశ్మీర శివాలయం ఖాళీ ప్రాంగణంలో ఆటో, బైక్‌లపై కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని,  పోలీసు వాహనాన్ని చూసి వారు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి ఐదుగురిని పట్టుకున్నారని తెలిపారు.పట్టుబడిన వారి ఆటోలో తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో ఎండు గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. 

అరెస్టయిన నిందితులు..

మహమ్మద్ అన్వర్, షేక్ ముజాహిద్ పాషా,మహమ్మద్ వజీర్ ఖాన్,దేవరం రాకేష్ @ రాఖీ, మహమ్మద్ ఆదిల్

Previous ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Next ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు విన‌తిప‌త్రం
ADVERTISEMENT