| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అలాగే యువత అంతా ఏకమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.


#RajannaSircilla #Sircilla #ThotaAgaiah #BRS #Vamshi #RacharlaGollapalli #Ellareddypet #Telangana #SircillaNews #TeluguNews #YouthAwareness #MentalHealthAwareness #Staya #BreakingNewsIndia

Previous ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు విన‌తిప‌త్రం
Next వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ADVERTISEMENT