| Daily భారత్
Logo




చదువుల తల్లికి సత్కారం.. ఆర్ధిక సాయం అందజేత

News

Posted on 2026-04-17 14:47:37

Share: Share


చదువుల తల్లికి సత్కారం.. ఆర్ధిక సాయం అందజేత

నూతన వస్త్రాలు బహుకరణ 

డైలీ భారత్, మహబూబాబాద్ : చదువుకు ఏ సమస్య అడ్డు కాదని నిరూపించిన సుంకరి హిమబిందు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడామైదానంలో  వాకర్స్ కాఫి క్లబ్  ఆద్వర్యంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని,  నడివాడ వాసి అయిన సుంకరి హిమ బిందు  ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్  ఫలితాల్లో బైపీసీ విభాగంలో  985/1000 మార్కులు సాధించగా ఆమెను  వాకర్స్  ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదానందం హాజరై మాట్లాడారు.  హిమబిందులో  ఉన్న టాలెంట్ గమనించి ఆమెకు ప్రత్యేకంగా బోధనతో పాటు పరీక్ష ఫీజు కూడా స్వయంగా చెల్లించి ప్రోత్సహించగా మంచి మార్కులు సాధించిందని అభినందించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు పరకాల రవీందర్ రెడ్డి, వంగ రామన్న, డాక్టర్ బి. వీరన్న మాట్లాడుతూ.. హిమబిందు చిన్నప్పటి నుంచే అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. తన నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో తల్లే అన్ని తానై ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించిందని అన్నారు. అంతేకాకుండా పదోతరగతి తర్వాత హిమబిందుకు పెళ్లి కూడా చేయగా కూతురు కూడా జన్మించిందని పేర్కొన్నారు. అంతలోనే భర్త కూడా చనిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటు తండ్రి, అటు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన హిమబిందు తన తల్లి ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనే కాంక్షతో మానుకోట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేరి ప్రిన్సిపాల్ సదానందం, ఆద్యాపకులు కలిసి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 985/1000 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకుందని హిమబిందును అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడతామని ప్రకటించారు.  ఈ సందర్భంగా  హిమబిందుతో పాటు తోడ్పాటు అందించిన తల్లిని , ప్రిన్సిపల్ సదానందంలను ఘనంగా శాలువాలతో సన్మానించారు.  చదువుల తల్లి హిమబిందుకు ఆర్థిక సాయంగా  రూ. 27  వేల రూపాయలతో పాటు  నూతన వస్త్రాలు అందజేశారు.  ఇంకా రిటైర్డ్ ఏరియాసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ బి. వెంకట్రాములు, రిటైర్డ్ టీచర్లు యాదగిరి, సుంకరి వెంకటేశ్వర్లు,  ఆద్యాపకులు స్వేత, చొప్పరి శ్రీనివాస్, బాలికల పాఠశాల ఇన్చార్జి సునీత తదితరులు ప్రసంగించారు. .


ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ బాద్యులు చౌడవరపు సుధాకర్,  బవిరిశెట్టి నాగేశ్వరరావు,  చిదిరాల శరత్ కుమార్, ముల్లంగి మోహన్ రెడ్డి, మాలె కాళీనాథ్, హేమచందర్, అబ్దుల్ ఆరీఫ్, నరెడ్ల రమేష్, ఆల్టెక్ రమేష్, పింగిళి నర్సింహ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తాడూరు వెంకట్రాం నర్సయ్య, మందుల రఘు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >